Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఆగ్రహం
Bandi Sanjay: కేసీఆర్‌ను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి బీజేపీని ఎందుకు పిలవలేదు
Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఆగ్రహం
Bandi Sanjay: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి.. బీజేపీ నాయకులను ఎందుకు ఆహ్వానించలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం వల్లే.. ఆత్మహత్యలు జరిగాయని... బండి సంజయ్ అన్నారు. కేసీఆర్‌కు స్వయంగా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణకు మద్దతిచ్చిన బీజేపీని ఎందుకు పిలవలేదని మండిపడ్డారు. సోనియాగాంధీ కేసీఆర్ ఓకే వేదికగా పంచుకునేలా ఎత్తుగడ చేశారు కానీ.. అది పని చేయలేదన్నారు. తెలంగాణ అధికారిక చిహ్నంలో చార్మినార్ ఉండొద్దన్న బండి సంజయ్... అధికారిక చిహ్నంలో అమర వీరుల స్తూపం ఉంటే మంచిదేనని పేర్కొన్నారు.