Bandi Sanjay: తడిసిన వడ్లన్నీ ప్రభుత్వం కొనాల్సిందే
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఆరోపణలు
Bandi Sanjay: తడిసిన వడ్లన్నీ ప్రభుత్వం కొనాల్సిందే
Bandi Sanjay: మేనిఫెస్టో తమకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని ప్రకటించిన కాంగ్రెస్... తరుగు పేరుతో రైతుల వద్ద తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. ఇది ముమ్మాటికీ దేవుళ్లను అవమానించినట్లే అని హాట్ కామెంట్స్ చేశారు. దేవుళ్లంటే మీకు అంత చులకనా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బండి సంజయ్ పరిశీలించారు. దళారులు 6 నుండి 10 కిలోల వరకూ తరుగు తీస్తున్నారని...దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని బండి సంజయ్ కామెంట్స్ చేశారు.