Bandi Sanjay: 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు

Bandi Sanjay: ఆర్‌ఎస్‌లా రాజకీయ వ్యభిచారం చేసే పార్టీ బీజేపీ కాదు

Update: 2023-06-15 02:09 GMT

Bandi Sanjay: 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు

Bandi Sanjay: కుత్బుల్లాపూర్‌ సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్నారు. బీఆర్‌ఎస్‌లా రాజకీయ వ్యభిచారం చేసే పార్టీ కాదని.. బీజేపీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందేనన్నారు. కాంగ్రెస్‌ను జాకీ పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదన్నారు. ధరణి వల్ల లాభ పడింది కేసీఆర్‌ ప్రభుత్వమేనన్న బండి.. కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు కేసీఆర్‌ డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు.

Tags:    

Similar News