Bandi Ramesh: 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదు
Bandi Ramesh: నియోజకవర్గంలో కబ్జాలు తప్ప..అభివృద్ధి శూన్యం
Bandi Ramesh: 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదు
Bandi Ramesh: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కూకట్‌పల్లి కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్ అన్నారు. ఓల్డ్ బోయిన్‌పల్లిలో ఏర్పాటు చేసిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో బండి రమేష్ పాల్గొన్నారు.10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదని బండి రమేష్ ఆరోపించారు. నియోజకవర్గంలో కబ్జాలు తప్ప అభివృద్ది శూన్యమని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజలు స్వాగతిస్తున్నారన్న ఆయన.. అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.