Bajireddy Govardhan: ఉద్యోగులు మాత్రమే విలీనం.. సంస్థ అలాగే ఉంటుంది

Bajireddy Govardhan: ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లు

Update: 2023-08-03 03:46 GMT

Bajireddy Govardhan: ఉద్యోగులు మాత్రమే విలీనం.. సంస్థ అలాగే ఉంటుంది

Bajireddy Govardhan: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వంలో విలీనం అయినా.. సంస్థ అలాగే ఉంటుందని ఆ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రోడ్డు రవాణా కార్పొరేషన్ అలాగే ఉంటుందని.. దానికి ఛైర్మన్‌, ఎండీ కొనసాగుతారని బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం తర్వాత నిజామాబాద్ కు వచ్చిన బాజిరెడ్డి గోవర్ధన్‌కు సంస్థ ఉద్యోగులు, కార్మికులు ఘన స్వాగతం పలికారు. బాజిరెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్‌ను కార్మికులు, ఉద్యోగులు సన్మానించారు. ఆర్టీసీ విలీనంపై కమిటీ ఏర్పాటైందని.. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెడుతుందని బాజిరెడ్డి గొవర్దన్ అన్నారు.

Tags:    

Similar News