Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్కూల్ లైబ్రరీ కబ్జాకు యత్నం

Telangana: మణుగూరు (మం) ZPSS కో-ఎడ్యుకేషన్ ఉన్నత పాఠశాల * అంతర్భాగమైన మెల్విన్ జోన్స్ లైబ్రరీ ఆక్రమణకు యత్నం

Update: 2021-02-27 08:15 GMT

Representational Image

Telangana: కబ్జా చేయాలనుకునే వారికి అదీ... ఇదీ అనే తేడా ఉండదు. పాఠశాలలో పిల్లలకు విజ్ఞానాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రంధాలయాన్ని కూడా కొట్టేయాలనే ప్రయత్నాలు చేసిన అక్రమార్కుల స్వార్ధం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. కుట్రను పసిగట్టిన ఆ స్కూల్ హెడ్ మాస్టర్, పూర్వవిద్యార్ధులు, విద్యార్ధి సంఘ నాయకులు అక్రమం జరగకుండా అడ్డుకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ZPSS కో-ఎడ్యుకేషన్ ఉన్నత పాఠశాలలో అంతర్భాగంగా ఉన్న మెల్విన్ జోన్స్ గ్రంధాలయాన్ని కబ్జా చేసేందుకు కొందరు అక్రమార్కులు ప్రయత్నించారు. అభివృద్ధి పేరుతో స్కూల్ కి లైబ్రరీకి మధ్య గోడను నిర్మించి వేరు చేయాలని లయన్స్ క్లబ్ వారు ప్రయత్నించారు. ఈ కోవలో వారు చేపట్టిన పనులను విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులతో కలిసి అడ్డుకున్నారు.

అభివృద్ది చేసేందుకు ఎటువంటి సమాచారం తెలపకపోగా, కనీసం ప్రధానోపాధ్యాయుని అనుమతి కూడా తీసుకోలేదు. వాళ్లకు తోచిన రీతిలో గ్రానైట్ మెటల్ తో లైబ్రరీ పరిసరాలను నింపి చదును చేసుకున్నారు. వారి స్వలాభం కోసమే లైబ్రరినీ కబ్జా చేసేకందుకే ఇదంతా చేసారని విద్యార్ధి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది విద్యార్థులతో కలిసి గ్రంధాలయం తాళాన్ని పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. గ్రంధాలయం గేటును మూసివేశారు. ఈ విషయాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి గ్రంధాలయాన్ని తిరిగి పాఠశాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కోవలో స్థానిక ఎమ్మెల్యే పేరును కొందరు స్వార్ధపరులు వాడుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Tags:    

Similar News