Bhuvanagiri: భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం.. డెడ్ బాడీని కొరికేసిన ఎలుకలు
Bhuvanagiri: సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్న కుటుంబసభ్యులు
Bhuvanagiri: భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం.. డెడ్ బాడీని కొరికేసిన ఎలుకలు
Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రి మార్చురీలో దారుణం చోటుచేసుకుంది. మార్చురీలో సిబ్బంది నిర్లక్ష్యంతో మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఆదివారం భువనగిరి పట్టణంలోని ప్రగతినగర్‌కు చెందిన లారీ డ్రైవర్ రవి మద్యానికి బానిసై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి జిల్లా ఆసుపత్రి మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. ఉదయం పోస్టుమార్టం చేయడానికి వెళ్లగా రవి కుటుంబ సభ్యులు... ముఖంపై ఎలుకలు కొరికినట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు మార్చురీ సిబ్బందిని నిలదీశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.