Shamshabad: సన్‌రైజ్‌ హాస్పిటల్‌లో దారుణం.. డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళ మృతి

Shamshabad: ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువుల ఆందోళన

Update: 2023-12-20 08:00 GMT

Shamshabad: సన్‌రైజ్‌ హాస్పిటల్‌లో దారుణం.. డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళ మృతి

Shamshabad: శంషాబాద్‌ సన్‌రైజ్‌ హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి చెందింది. రెండురోజుల క్రితం నిర్మల అనే మహిళ.. అనారోగ్య కారణంతో సన్‌రైజ్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్‌ అయింది. అయితే.. నిన్న రాత్రి పరిస్థితి విషమించి ఆ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే నిర్మల మృతి చెందిందంటూ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పతి అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News