Arvind Dharmapuri: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం
Arvind Dharmapuri: తెలంగాణలో యువతకు ఉద్యోగాలు రావడం లేదు
Arvind Dharmapuri: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం
Arvind Dharmapuri: బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. తెలంగాణలో ఓ జనరేషన్ జీవితాలను కేసీఆర్ నాశనం చేశారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువతకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం అయిలాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ రోడ్‌షో నిర్వహించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని.. తెలంగాణ బీజేపీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. దేశం కోసం ప్రధాని మోడీ రోజుకు 18 గంటలు పని చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌజ్‌లోనే ఎక్కువ సమయం ఉంటున్నారని ఆరోపించారు.