తెలంగాణలో ఇంటర్‌ బోర్డ్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

TS Inter 2022 Exams: మే 6 నుండి పరీక్షలు ప్రారంభం

Update: 2022-05-02 03:06 GMT

తెలంగాణలో ఇంటర్‌ బోర్డ్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

TS Inter 2022 Exams: తెలంగాణలో ఇంటర్‌ బోర్డ్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మే 6 నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు సరిపడా బెంచీలు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇన్విజిలేటర్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లకు డ్యూటీలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్ భద్రత ప్రమాణాలు పాటిస్తూ పరిక్షలను నిర్వహించాలని విద్యాశా‌ఖ అదేశాలు జారీచేసింది. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9లక్షల 7వేల 3వందల 96 మంది విద్యార్ధులు ఇంటర్ పరి‌క్షకు హాజరు కానున్నారు. వేసవి తీవ్రత, ఉక్కపోతను దృష్టిలో ఉంచుకుని గదుల్లో ఫ్యాన్లను ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రతి సెంటర్‌లో ఆశ వర్కర్‌, ఏఎన్‌ఎం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గదుల ఎదుట షామియానాలు ఏర్పాటు చేసి ఎండవేడి గదుల్లోకి రాకుండా చూస్తున్నారు. ఇక విద్యార్ధులు సరైన సమయంలో పరీక్షా సెంటర్లకు చేరేందుకు ఆర్టీసీ బస్సులు నడిపే విధంగా చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్ విధించనున్నారు.

ఇక ఇంటర్‌ ప్రశ్నపత్రాల సీల్‌ తెరిచినప్పటి నుండి విద్యార్థులకు అందించేవరకు, వారు పరీక్ష రాస్తున్న తీరును ఇలా అన్నింటిని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. మాస్‌కాపీయింగ్‌ను నిరోధించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా మొబైల్‌ యాప్‌ ద్వారా సెంటర్‌ లోకేషన్‌ గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 

Full View


Tags:    

Similar News