Suicide: లోన్‌ రికవరీ ఏజెంట్ల వేధింపులు.. అవమానంతో ఆత్మహత్య చేసుకున్న నిజాముద్దీన్‌

Suicide: పెండింగ్‌ అమౌంట్‌ రూ.4వేలు చెల్లించాలని ఫైనాన్స్‌ ఏజెంట్ల ఒత్తిడి..

Update: 2022-10-20 02:53 GMT

Suicide: లోన్‌ రికవరీ ఏజెంట్ల వేధింపులు.. అవమానంతో ఆత్మహత్య చేసుకున్న నిజాముద్దీన్‌

Suicide: లోన్‌ రికవరీ ఏజెంట్ల వేధింపులకు మరో వ్యక్తి బలైన ఘటన.. హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. నిజాముద్దీన్‌ ఈ మధ్య కాలంలో EMI ద్వారా రెండు ఫోన్లను కొనుగోలు చేశాడు. అయితే.. ఉద్యోగం లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిజాముద్దీన్‌.. గత కొంతకాలంగా EMI లు చెల్లించడం లేదు. దీంతో.. నిజాముద్దీన్‌ ఇంటికి వచ్చిన రికవరీ ఏజెంట్లు.. పెండింగ్‌లో ఉన్న 4వేలు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. చుట్టుపక్కలవారు చూస్తుండగానే.. నిజాముద్దీన్‌ కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మనస్తాపానికి గురైన బాధితుడు నిజాముద్దీన్‌.. సెల్ఫీ వీడియోలో తన బాధను వ్యక్తపరుస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు.

Tags:    

Similar News