రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరొకరు మృతి

తాండూరు వాల్మీకీనగర్‌కు చెందిన వెంకటమ్మగుర్తింపు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వెంకటమ్మ మీర్జాగూడ ప్రమాదంలో 21కి చేరిన మృతుల సంఖ్య

Update: 2025-11-04 06:48 GMT

రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరొకరు మృతి 

రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. తాండూరు వాల్మీకీనగర్‌కు చెందిన ప్రసాద్ భార్య వెంకటమ్మగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం తాండూరు నుంచి బయల్దేరిన బస్సులో వెంకటమ్మ కూడా ఉన్నారు. పోస్టు మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వెంకటమ్మ మృతదేహన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

Tags:    

Similar News