Warangal: వరంగల్‌ ఎంజీఎంలో మరణ మృదంగం

Warangal: కరోనాతో ఎంజీఎంలో ఇవాళ మరో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం

Update: 2021-04-19 05:30 GMT

వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ (ఫైల్ ఇమేజ్)

Warangal: వరంగల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఎంజీఎం ఆస్పత్రిలో కోవిడ్ మరణ మృదంగం మోగిస్తోంది. కోవిడ్ వార్డులో చికిత్స పొందుతూ ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

కరోనా కాటుకు తెలంగాణ విలవిల్లాడుతోంది. మొదటి దశలో లేని దూకుడు సెకండ్ వేవ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇటీవలి వరకూ వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరాయి. 5వేల కేసులు నమోదయ్యే స్టేజ్‌కు పరిస్థితి చేరింది. ఏప్రిల్ ప్రారంభంలో వెయ్యి కేసులు నమోదవుతుండగా ఇవాళ ఏకంగా 4 వేలు దాటిపోయాయి.

Full View


Similar News