KCR: కేసీఆర్‌ను పరామర్శించిన మాజీ గవర్నర్‌ నరసింహన్ దంపతులు

KCR: నందినగర్‌లోని నివాసానికి వెళ్లిన నరసింహన్ దంపతులు

Update: 2024-01-07 10:45 GMT

KCR: కేసీఆర్‌ను పరామర్శించిన మాజీ గవర్నర్‌ నరసింహన్ దంపతులు

KCR: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మాజీ గవర్నర్‌ నరసింహన్ దంపతులు పరామర్శించారు. నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లిన వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు. కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం నరసింహన్ దంపతులు కాసేపు ఆయన కుటుంబసభ్యులతో ముచ్చటించారు. కాగా గతేడాది డిసెంబర్‌లో ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్‌లోని బాత్రూమ్‌లో కేసీఆర్ జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. దాంతో యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు సర్జరీ చేసి నాలుగు వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అప్పటినుంచి కేసీఆర్ నందినగర్‌లోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను పలువురు పరామర్శించేందుకు వస్తున్నారు.

Tags:    

Similar News