YS Sharmila: మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై విచారణ జరపాలి

YS Sharmila: ట్రాఫిక్ వయోలేషన్ కేసులో రిమాండ్ ఎందుకు అడిగారు

Update: 2022-12-01 08:35 GMT

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై విచారణ జరపాలి 

YS Sharmila: పాదయాత్రను అపే ‍యత్నం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిన విషయాన్ని గవర్నర్ తమిళిసైకి వివరించానని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. కేటీఆర్ భార్య ఆంధ్రా మహిళ కాదా షర్మిల అని ప్రశ్నించారు. తాను ఇక్కడే చదివానని, ఇక్కడే పెళ్లి చేసుకున్నా నా బతుకు ఇక్కడే ఇక్కడే జీవిస్తున్నానని చెప్పారు. కేసీఆర్ భాషపై షర్మిల వీడియోలు ప్రదర్శించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై విచారణ జరపాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు బీజేపీతో డ్యూయెట్లు పాడుకున్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారామె రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కేసీఆర్ కాదా అని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు పద్ధతి మార్చుకోవాలని షర్మిల కోరారు. తనను అరెస్టు చేయాలనుకున్నారని చెప్పారు. ట్రాఫిక్ వయోలేషన్ కేసులో రిమాండ్ ఎందుకు అడిగారని ప్రశ్నించారు.

Tags:    

Similar News