మారుతీరావు సూసైడ్ నోట్ పై స్పందించిన అమృత

ప్రణయ్ హత్యకు కారణం అయిన వారికి శిక్ష పడాలని కోరుకున్నాం. కానీ, ఆత్మహత్య చేసుకోని చనిపోవాలని కోరుకోలేదని అన్నారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదు.

Update: 2020-03-09 08:47 GMT

ప్రణయ్ హత్యకు కారణం అయిన వారికి శిక్ష పడాలని కోరుకున్నాం. కానీ, ఆత్మహత్య చేసుకోని చనిపోవాలని కోరుకోలేదని అన్నారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదు. కానీ, ఆయన ఆత్మహ్యతకు కారణం తెలియదు. ఆయన సోదరుడుతో ఆయనకు గొడవలు ఉన్నాయి అని అమృత అన్నారు. తండ్రి భౌతికకాయన్ని చూడాలని వెళ్లానని శ్రావణ్ కుటుంబ సభ్యులు తనను అక్కడ నుంచి తిరిగి వెళ్లాలని నినాదాలు చేశారని చెప్పారు.

"భర్త చనిపోతే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసని, అందుకే మా అమ్మ దగ్గరకు నేను వెళ్ళను ఆమె తన దగ్గరకు వస్తే ఆహ్వానిస్తానని అన్నారు. తండ్రి ప్రేమలో స్వార్థం ఉందని వ్యాఖ్యానించారు. శ్రావణ్ పదే పదే తన తండ్రిని గతంలో రెచ్చగొట్టారని ఆరోపించారు. మారుతీరావు తప్పు చేయడానికి శ్రావణ్ రచ్చకొట్టి ఉంటారని ఆరోపించారు. శ్రావణ్ అంటే మారుతీరావు భయపడతారు". అని అన్నారు. తండ్రి ఆత్మహత్య తనకు బాధ కలిగించిందని ఆమె అన్నారు. చివరిగా మారుతీరావు  సూసైడ్ నోట్ పై మీడియా ప్రశ్నింగా.. అమృత మాట్లాడుతూ.. తల్లి గిరిజ తనతో ఉండాలనుకుంటే ఉండొచ్చు. తన దగ్గరకు నేను వెళ్లనని అమృత వ్యాఖ్యానించారు. 

అమృతాప్రణయ్‌ తండ్రి మారుతీరావు శనివారం అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ఆయన హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో విగతజీవిగా కనిపించారు. కాగా, సోమవారం మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమృత తండ్రి భౌతికకాయన్ని చూసేందుకు వెళ్లారు. దీంతో అక్కడ ఉన్న బంధువులు తిరిగి వెళ్లానని నినాదాలు చేశారు. అమృత వెనుదిరిగి వెళ్లారు. అయితే మారుతీరావు సూసైడ్‌ చేసుకున్న ప్రదేశంలో నోట్ లభ్యమైంది. తల్లి అమృత నువ్వు అమ్మ దగ్గరికి వెళ్లిపో అంటూ లెటర్ రాసినట్లు ఉంది. 

Full View


Tags:    

Similar News