ప్రణయ్ హత్యపై కోర్టు తీర్పు: అమృత ఏమన్నారంటే?

Amrutha Pranay: ప్రణయ్ కేసులో జడ్జిమెంట్ పై మార్చి 10వ తేదీ రాత్రి అమృత స్పందించారు.

Update: 2025-03-11 06:27 GMT

ప్రణయ్ హత్యపై కోర్టు తీర్పు: అమృత ఏమన్నారంటే?

Amrutha Pranay: ప్రణయ్ కేసులో జడ్జిమెంట్ పై మార్చి 10వ తేదీ రాత్రి అమృత స్పందించారు. రెస్ట్ ఇన్ పీస్ అంటూ అమృత తన ఇన్ స్టాలో పోస్టు పెట్టారు. కోర్టు తీర్పుపై ప్రణయ్ తండ్రి బాలస్వామి సోమవారం మిర్యాలగూడలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రణయ్ హత్యే పరువు హత్యలో చివరిది కావాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. అంతకుముందు ఆయన ప్రణయ్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ తీర్పుపై సోషల్ మీడియాలోనే అమృత స్పందించారు.

ప్రణయ్ హత్య కేసులో అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ కూడా జీవితఖైధును విధించింది కోర్టు. అమృత వల్లే తన తండ్రికి శిక్ష పడిందని శ్రవణ్ కూతురు ఆరోపించారు. కోర్టులో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అన్యాయంగా తన తండ్రిని కేసులో ఇరికించారని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

ప్రణయ్ కేసు తీర్పునకు సంబంధించి నల్గొండ కోర్టు వద్దకు శ్రవణ్ కుటుంబసభ్యులతో పాటు అమృత బంధువులు కూడా చేరుకున్నారు.శ్రవణ్ కు శిక్ష పడడంతో వారు ఆవేదన చెందారు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడ ఆసుపత్రి వద్ద ప్రణయ్ ను హత్య చేశారు.

తన తల్లితో కలిసి అమృత హైదరాబాద్ లో ఉంటున్నారు. సోషల్ మీడియాలో అమృత చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించిన తీర్పుపై ఆమె సోషల్ మీడియాలో స్పందించారు.

Tags:    

Similar News