Allakas : హైదరాబాద్‌లో అల్లకాస్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ప్రారంభం
హైదరాబాద్‌లో అల్లకాస్ షాపింగ్ మాల్ ప్రారంభం షాపింగ్ మాల్‌ని ప్రారంభించిన నటి ప్రియాంక మోహన్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్.. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర అల్లకాస్ ఒక కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ -అల్లక సత్యనారాయణ
Allakas : హైదరాబాద్‌లో అల్లకాస్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ప్రారంభం
అల్లకాస్ ఒక కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అని, హైదరాబాద్‌కి సరికొత్త ఫ్యాషన్‌ను పరిచయం చేయడానికి అల్లకాస్ వచ్చిందన్నారు అల్లకాస్ అధినేత అల్లక సత్యనారాయణ. హైదరాబాద్ సిటీ సమీపంలో బండ్లగూడ జాగీర్‌లోని కాళీమాతా మందిర్ మెయిన్ రోడ్డులో.. అల్లకాస్ షాపింగ్ మాల్‌ను సెప్టెంబర్ 22న ఘనంగా ప్రారంభించారు. అల్లకాస్ ఫ్యామిలీ షాపింగ్ మాల్‌ని ప్రముఖ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర పాల్గొన్నారు. ఫ్యాషన్ అంటే అల్లకాస్, అల్లకాస్ అంటే ఫ్యాషన్ అని తెలిపారు. గతంలో ఎక్కడా చూడని విధంగా తమ వద్ద నూతన కలెక్షన్స్ ఉన్నాయన్నారు. ఎలాంటి షాపింగ్ మాల్స్‌లో లేని విధంగా తక్కువ ధరకు, నాణ్యమైన కలెక్షన్స్ అదిస్తున్నామన్నారు. అల్లకాస్ కేవలం షాపింగ్ మాల్ మాత్రమే కాదు, హైదరాబాద్‌లో ఫ్యాషన్‌కి ఒక మైలురాయిని తెస్తుందన్నారు. అల్లకాస్ షాపింగ్ మాల్ వల్ల బండ్లగూడలో 200 మందికి పైగా ఉపాధి పొదుతారని అల్లకాస్ అధినేత అల్లక సత్యనారాయణ తెలిపారు.