Telangana Elections 2023: రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది.
Telangana Elections: రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 13న నామినేషన్ల స్కృటీని, 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. అయితే.. ఈనెల 30న పోలింగ్, వచ్చే నెల 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. శుక్రవారంతో నామినేషన్ల పక్రియ పూర్తి కాగా.. మెుత్తం 119 నియోజకవర్గాలకు 1100లకు పైగా అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్రధాన పార్టీలతో పాటు పలు చిన్నాచితకా పార్టీలు, స్వతంత్రులు బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టోను పార్టీలు విడుదల చేస్తున్నాయి.
గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తామంటూ కాంగ్రెస్, రూ.400లకే ఇస్తామంటూ బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించాయి. అంతేనా నేనైతే ఏడాదికి రూపాయికే నాలుగు సిలిండర్లు ఇస్తానంటున్నారు సనత్‌నగర్ నుంచి పోటీ చేస్తున్న ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి కుమ్మరి వెంకటేష్ యాదవ్. నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన.. తాను అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.1కే నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు ఒక్క రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్య సలహా, ఒక రూపాయికే న్యాయసలహా అందిస్తామని హామీ ఇచ్చారు.
ఏపీ తరహాలో ప్రతి 100 కుటుంబాలకు ఒక వలంటీర్‌ని నియమిస్తామని చెప్పారు. 70 ఏళ్లు పైబడిన వారు ఎమర్జెన్సీ ప్యానిక్ బటన్ నొక్కితే సాయం అందుతుందని వెంకటేష్ యాదవ్ ప్రచారం చేస్తున్నారు. ఓట్లు రాబట్టేందుకు నాయకులు కోట్లకు పడగలెత్తే విద్య వంటి పెద్ద వాగ్దానాలు చేస్తున్నారు. ఉచిత సౌకర్యాలు, సంక్షేమ పథకాలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటారో వేచి చూడాల్సిందే.