Bangalore: రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ అరెస్టు

నటి హేమ మే 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారు. ఆమె రక్తనమూనాలో డ్రగ్స్ పాజిటివ్‌ను గుర్తించారు.

Update: 2024-06-03 11:59 GMT

Bangalore: రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ అరెస్టు

Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలుగు నటి హేమ అరెస్టు అయ్యారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ కూడా పాల్గొన్నారని కర్ణాటక పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. సోమవారం నాలుగు గంటల సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన బెంగళూరు సీసీబీ పోలీసులు హేమను అదుపులోనికి తీసుకోవడం జరిగింది. మరోవైపు.. మంగళవారం నాడు ఆమెను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నటి హేమ మే 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారు. ఆమె రక్తనమూనాలో డ్రగ్స్ పాజిటివ్‌ను గుర్తించారు. దీంతో విచారణకు రావాలని హేమతో పాటు... రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురికి నోటీసులు ఇచ్చారు. మొదటిసారి గత సోమవారం విచారణకు హాజరు కావాలని, రెండోసారి జూన్ 1న విచారణకు హాజరు కావాలని హేమకు నోటీసులు ఇచ్చారు. కానీ ఆమె సీసీబీ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు.

Full View


Tags:    

Similar News