Telangana: ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు జాప్యం

Telangana: కోట్లలో బిల్లులు పెండింగ్‌ ఉండటంతో ఆరోగ్యశ్రీ పథకం... కింద చికిత్స చేసేందుకు వెనకడుగేస్తున్న ప్రైవేట్‌ హాస్పిటళ్లు

Update: 2022-03-15 04:45 GMT

 ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు జాప్యం

Telangana: తెలంగాణలో ఆరోగ్యశ్రీ చికిత్స అందించడంలో ప్రైవేట్ ఆసుపత్రులు అయోమయంలో పడ్డాయి. ఏటా ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు జాప్యం జరుగుతోంది. ఆరోగ్యశ్రీతో చికిత్స చేస్తే ప్రభుత్వం బకాయిలు ఎప్పుడు చెల్లిస్తుందో కూడా తెలియడం లేదు. దాంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ కూడా చేయలేమని డాక్టర్లు అంటున్నారు.

తెలంగాణలోని అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యంతో పాటుగా ఆరోగ్యశ్రీ మరియు అయుష్మన్ భారత్ ట్రీట్మెంట్ పేదవారికి పూర్తిగా అందిస్తున్నామని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నాగేంద్ర అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డ్ లేకున్నా ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు.

ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ చేయలేమని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అంటుంటే మరికొన్ని ఇప్పటికే ఆరోగ్యశ్రీ నుండి తప్పుకున్నాయి. ప్రభుత్వం చెప్పుకోడానికి మాత్రమే ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసిందని ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించి ఎందరో పేదలు నిరాశకు గురవుతున్నారని ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంఘం నేతలంటున్నారు.

Tags:    

Similar News