Hyderabad: పగ తీర్చుకునేందుకు సినిమాటిక్ స్కెచ్ వేసిన ప్రియురాలు.. కారులో గంజాయి పెట్టించి

Hyderabad: నిందితుల నుంచి 40 గ్రాముల గంజాయి స్వాధీనం

Update: 2023-12-26 11:09 GMT

Hyderabad: పగ తీర్చుకునేందుకు సినిమాటిక్ స్కెచ్ వేసిన ప్రియురాలు.. కారులో గంజాయి పెట్టించి

Hyderabad: తన మాజీ ప్రియుడిపై పగ తీర్చుకునేందుకు ప్రియురాలు సినిమాటిక్ స్కెచ్ వేసింది. తన మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించింది. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో చోటుచూసింది. తన పగ తీర్చుకునేందుకు యువతి తన స్నేహితుల సాయంతో మాజీ ప్రియుడి కారులో గంజాయి పెట్టించింది. పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని పట్టించింది. అయితే కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు విచారణ చేయగా.. యువతి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆ యువతితో పాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 40 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News