ఖమ్మం జిల్లా వైరాలో ఓ యువతి ఆత్మహత్య

Khammam: కుటుంబ సమస్యలే కారణమంటున్న స్థానికులు

Update: 2022-12-29 05:12 GMT

ఖమ్మం జిల్లా వైరాలో ఓ యువతి ఆత్మహత్య

Khammam: ఖమ్మం జిల్లా వైరాలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానిక మూడవ వార్డు సంత బజారులో కుటుంబ సమస్యలతో తుల్లూరి సాయి ప్రసన్న అనే 24 ఏళ్ల యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాయి ప్రసన్న కొన్నాళ్లుగా మానసికంగా ఇబ్బందులకు గురవుతోందని స్థానికులు తెలిపారు. ఇటీవల వివాహం నిశ్చయమైందని, అయితే పలు సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని మృతురాలి చెల్లి జయశ్రీ చెప్పారు. ఈ ఘటనపై ఎస్ఐ వీరప్రసాద్ కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News