Heavy Rain: తీరం దాటిన వాయుగుండం..తెలుగు రాష్ట్రాలకు వర్ష గండం
Heavy Rain: వాయుగుండం తీరం దాటింది. నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన ఉంది. ఏ సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయో తెలుసుకుందాం. గురువారం సాయంత్రం 6గంటల తర్వాత బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది. ప్రస్తుతం అది బంగ్లాదేశ్ లోని ఢాకాకు దగ్గరలో ఉంది. అది బలహీనపడలేదు. దాని ప్రభావం మరో 2 రోజులుకనిపించేలా ఉంది. దట్టమైన మేఘాలకు తోడు, నైరుతీ రుతుపవన గాలులు కూడా ఉన్నాయి. అందువల్ల వాయుగుండం ప్రభావం వల్ల బంగ్గాదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఏపీ, తెలంగాణపై ప్రభావం కనిపించనుంది.
రెండు రాష్ట్రాల్లో మే 31 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయని తెలిపింది. అయితే నేడు అతి భారీ వర్షాలు తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక తీరంలో పడతాయని ఐఎండీ తెలిపింది. నైరుతీ రుతుపవనాలు చత్తీస్ గఢ్, ఒడిశాకు విస్తరిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో బెంగాల్ మొత్తం ఇవి వ్యాపిస్తాయి. ఈ గాలులు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు అత్యంత అనుకూల పరిస్థితులు. పశ్చిమం వైపు నుంచి వస్తున్న చల్లని గాలులు, రాజస్థాన్ పై ఉన్న ద్రోణి ఇవన్నీ నైరుతీ రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులను కల్పిస్తున్నాయని ఐఎండీ తెలిపింది.
తెలంగాణలో ఉదయం 11 గంటల వరకు ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత సాయంత్రం 5 తర్వాత తెలంగాణలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయి. మొత్తంగా నేడు వాతావరణం చల్లగా ఉంటుంది. వాయుగుండం రెండు రోజుల్లో బలహీనపడే అవకాశం కనిపిస్తోంది అయినా ఏపీ, తెలంగాణలో వర్షాలు మరో వారం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. పశ్చిమం నుంచి మేఘాలు భారీగా వస్తున్నాయి. అలాగే తూర్పు వైపున కూడా చాలా మేఘాలు పోగై ఉన్నాయి. ఇవన్నీ తెలుగు రాష్ట్రాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.