Rahul Gandhi: రాష్ట్ర సంపదను మొత్తం ఒకే కుటుంబం అనుభవిస్తోంది
Rahul Gandhi: తెలంగాణలో కుటుంబ పాలన రాజ్యమేలుతోంది
Rahul Gandhi: రాష్ట్ర సంపదను మొత్తం ఒకే కుటుంబం అనుభవిస్తోంది
Rahul Gandhi: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ జగిత్యాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణలో జరుగబోతున్న ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య అంటూ అభివర్ణించారు రాహుల్‌గాంధీ. ప్రజలు ప్రజాస్వామ్య తెలంగాణను కోరుకుంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ పాలనను కొనసాగిస్తుందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన రాజ్యమేలుందన్నారు రాహుల్‌గాంధీ. రాష్ట్రంలో సంపదను మొత్తం ఒక కుటుంబమే అనుభవిస్తుందని ఆరోపించారు రాహుల్.