Neelam Madhu: పటాన్‌చెరులో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం
Neelam Madhu: తెలంగాణను రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారు
Neelam Madhu: పటాన్‌చెరులో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం
Neelam Madhu: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించిన నీలం మధు... ఇవాళ పటాన్‌చెరులో ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, మైనంపల్లి హన్మంతరావులు హాజరయ్యారు. బీసీ బిడ్డను గెలిపించుకోవాలని మైనంపల్లి హన్మంతరావు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు.