Komaram Bheem: వంతెన దాటుతుండగా పెరిగిన వరద ఉధృతి.. వ్యక్తి గల్లంతు
Komaram Bheem: గల్లంతయిన వ్యక్తి భిబ్రా గ్రామానికి చెందిన మల్లయ్యగా గుర్తింపు
Komram bheem: వంతెన దాటుతుండగా పెరిగిన వరద ఉధృతి.. వ్యక్తి గల్లంతు
Komaram Bheem: కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం అందేవెల్లి పెద్దవాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. వంతెన ధాటుతుండగా ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో దహేగాం మండలం భిబ్రా గ్రామానికి చెందిన మల్లయ్య గల్లంతయ్యాడు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు అందేవెల్లి బ్రిడ్జి కూలిపోగా రెండు మండలాల ప్రజలు తాత్కాలిక వంతెనను నిర్మించారు.ఈ వంతెన కూడా కూలిపోయే ప్రమాదం ఉన్నందున ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు తప్పేట్టు లేవని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.