Sunita Rao: కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పేరుతో భారీ మోసం.. గోషామహల్ ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు
Sunita Rao: దళారీల చేతిలో మోసపోవద్దని సునీతారావు సూచన
Sunita Rao: కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పేరుతో భారీ మోసం.. గోషామహల్ ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు
Sunita Rao: కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డు పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు అంటూ ఒక్క కార్డును 300 రూపాయలకు దళారులు అమ్ముతున్నారు. కార్డు ఉంటేనే.. పథకాలు వస్తాయంటూ ప్రచారం జరుగుతుండటంతో... గోషామమల్ కాంగ్రెస్ నేత సునీతారావు గోషామహల్ ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గోషామహల్‌లో భారీగా కార్డులు జారీ చేస్తుూ.. దోపిడీకి పాల్పడుతున్నట్టు ఆమె తెలిపారు.
ఇలా గ్యారెంటీ కార్డుల పేరుతో దొపిడీ పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా.... కాంగ్రెస్ పార్టీ ఎలాంటి గ్యారెంటీ కార్డులు జారీ చేయలేదని.. ప్రజలు గ్యారెంటీలంటూ వచ్చే ప్రచారాలను నమ్మొద్దని సునీతా రావు సూచించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని.. తెలిపారు.