Warangal Central Jail: సెంట్రల్ జైలు ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం
Warangal Central Jail: పాపాయపేటలోని 4 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ ఆరోపణ * సీఎం కేసీఆర్‌ను కలవడానికి వెళ్లిన దంపతులు
ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినా దంపతులు (ఫైల్ ఇమేజ్)
Warangal Central Jail: వరంగల్ అర్బన్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతుండగా దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. చెన్నారావుపేట మండలం పాపాయపేటలో ఉన్న నాలుగు ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ ఆరోపించారు బాధితులు. తమ గోడును సీఎం కేసీఆర్‌కు చెప్పుకోవడానికి రాగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో.. వరంగల్ సెంట్రల్ జైలు ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పుపెట్టుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న పోలీసులు.. బాధితులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.