కారు యాక్సిడెంట్ లో మలుపులెన్నో.. అసలేం జరిగింది..కుట్రా, ప్రమాదమా?

Update: 2020-02-17 09:51 GMT

ఒక ప్రమాదం... ఎన్నో అనుమానాలు. ఒక ప్రమాదం మరెన్నో కారణాలు. అసలేం జరిగింది? ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? ఇవే అనుమానాలు అనుకుంటే వాస్తవ విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? కరీంనగర్ జిల్లా అలగనూరులో జరిగిన కారు ప్రమాదంలో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్‌. ఈ కారు ప్రమాదంలో చనిపోయింది పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబంగా గుర్తించిన పోలీసులకు సవాలక్ష సవాళ్లు ఎదరవుతున్నాయ్‌. కరీంనగర్‌ శివారు కాకతీయ కెనాలో పడ్డ కారులో 20 రోజులుగా కుళ్లిపోయిన మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. చనిపోయింది ఎమ్మెల్యే సోదరి రాధా, ఆమె భర్త సత్యనారాయణరెడ్డి, మేనకోడలు వినయశ్రీ.

జనవరి 27వ తేదీన సత్యనారాయణరెడ్డి కుటుంబం కారులో పెద్దపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లింది. ఉదయం ఆరు గంటల సమయంలో ఏపీ 15, బీఎన్ 3438 కారులో వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. కరీంనగర్ దాటిన తర్వాత కాకతీయ కెనాల్ వద్ద ప్రమాదం జరిగింది. రేణిగుంట టోల్‌గేట్‌ ఇవతల ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత వేగంగా కారు కెనాల్‌లోకి దూసుకెళ్లిందని మాత్రమే తెలుస్తోందంటున్నారు పోలీసులు. కానీ జరిగింది ఇంకా ఏమైనా ఉందా? అది బయటకు రాలేకపోతోందా?

20 రోజుల తర్వాత కారు కొట్టుకు వచ్చింది. అయితే ప్రమాదం సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదాన్ని గుర్తించలేదని పోలీసులు అంటున్నారు. అయితే ఇక్కడ కుటుంబ సభ్యుల పాత్రపై పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు ఎవరూ కూడా కాంటాక్ట్ చేయలేదని తెలుస్తోంది. దీనితో కుటుంబంలో గొడవలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద ఆరా తీస్తున్నారు పోలీసులు.

సత్యనారాయణరెడ్డి కుటుంబం, కారు ప్రమాదం స్పందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసలు కుటుంబంలో ఏ గొడవలు లేవని అన్నారు. తరుచూ విహార యాత్రలకు వెళ్తూ ఉంటారని ఆయన చెబుతున్నారు. అయితే 20 రోజుల తర్వాత కూడా ఎవరూ ఇప్పటి వరకు పోలీసులను సంప్రదించలేదు. ఏమైనా పగలు ఉన్నాయా, కావాలనే ఎవరైనా ఇలా చేశారా... .అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ ఉదయం కాలవలో కొట్టుకువచ్చిన కారుని కొంత మంది స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు సంగతి బయటకు వచ్చింది. 

Tags:    

Similar News