Nepal Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. 70 మంది మృతి
Nepal Earthquake: రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదు
Nepal Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. 70 మంది మృతి
Nepal Earthquake: నేపాల్ లో భారీ భూకంపం వచ్చింది. ఇప్పటికే 70 మంది చనిపోగా.. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న రాత్రి 11.30కి వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. భూకంపం నుంచి వచ్చిన ప్రకంపనలు నేపాల్‌తోపాటూ..ఉత్తర భారత్‌లోనూ కనిపించాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, బీహార్‌లో భూమి కంపించింది. ఐతే..ఇండియాలో ప్రభావం పెద్దగా లేదని రిపోర్టులు చెబుతున్నాయి.
నేపాల్‌లో భూమిలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని NCS తెలిపింది. అందువల్లే ప్రకంపనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో ప్రజలు.. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీలో భవనాలు కూడా కంపించినట్లు చాలా మంది చెబుతున్నారు. నెల రోజుల కాలంలో నేపాల్‌లో భారీ భూకంపాలు రావడం ఇది మూడోసారి. తాజా భూకంపం వల్ల నేపాల్‌లో కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయని సమాచారం.