Road Accident: కొత్తకోటలో చెట్టును ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి
Road Accident: కొత్తకోట బైపాస్ వద్ద ప్రమాదం.. అతివేగం, నిద్రమత్తు వల్లే ప్రమాదం
Road Accident: కొత్తకోటలో చెట్టును ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి
Road Accident: వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. బళ్లారి నుంచి హైదరాబాదుకు వెళుతుండగా ఎర్టిగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో మరో చిన్నారి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. కారులో మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పెద్దవాళ్లు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని ఎస్సై మంజునాథ్ రెడ్డి తెలిపారు.