మహబూబ్‌నగర్‌లో బస్సు–కెమికల్ ట్యాంకర్ ఢీ: 40 మంది ప్రాణాపాయం తప్పింది
మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం కెమికల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన జగన్ ట్రావెల్స్ బస్సు బస్సు నుంచి దట్టమైన పొగలు జడ్చర్ల మండలం మాచారం దగ్గర ఘటన
మహబూబ్‌నగర్‌లో బస్సు–కెమికల్ ట్యాంకర్ ఢీ: 40 మంది ప్రాణాపాయం తప్పింది
మహబూబ్ నగర్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. కడప నుంచి హైదరాబాద్ వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు కెమికల్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది. జడ్చర్ల మండలం మాచారం దగ్గర ఘటన చోటు చేసుకుంది. బస్సు నుంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో మంటలు చెలరేగకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకున్నారు. మరో బస్సులో ప్రయాణికులను తరలించారు.