నీటి ట్యాంకర్ లో తెలంగాణ విద్యార్థులు...క్వారంటైన్ కి పంపిన పోలీసులు

బంగారు భవిష్యత్తు కోసం ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు తెలంగాణ విద్యార్థులు.

Update: 2020-04-26 10:41 GMT

బంగారు భవిష్యత్తు కోసం ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు తెలంగాణ విద్యార్థులు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇటు సొంత రాష్ట్రానికి చేరుకోలేక, ఇతర రాష్ట్రాలలో ఉండలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎలాగైనా తమ స్వస్థలాలకు చేరుకుని తమ వారిని కలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఎన్నిప్రయత్నాలు చేసినా పరిస్థితులు అనుకూలించక మార్గమద్యంలోనే పోలీసు చేతికి చిక్కి క్వారంటైన్ పాలవుతున్నారు. మహరాష్ట్రలోనూ ఇదే తరహ సంఘటన చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణకు చెందిన 20 మంది విద్యార్థులు మరఠ్వాడా ప్రాంతంలోని జల్నాలో అగ్రికల్చర్ కోర్సులను అభ్యసించడానికి వెళ్లారు. దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో లాక్ డౌన్ అమలు కావడంతో వారంతా అక్కడే చిక్కుకున్నారు. కొన్ని రోజుల నుంచి లాక్ డౌన్ ఎత్తేస్తే తమ ఇండ్లకు చేరుకుందాం అని ఎదురు చూసారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచెలంచెలుగా లాక్ డౌన్ సమయాన్ని పెంచుతుండడంతో వారి ఓపిక నశించి ఎలాగయినా తమ స్వస్థలాలకు చేరుకోవాలనుకన్నారు. అందుకోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో చివరికి ఓ వాటర్ ట్యాంక్ లారిని ఆశ్రయించారు.

ఆ డ్రైవర్ కూడా దానికి ఒప్పుకుని విద్యార్థులను వారి స్వస్థలాలకు చేర్చడానికి ఖాళీ ట్యాంకర్‌లో విద్యార్థులను ఎక్కించుకుని కూర్చోని బయలుదేరారు. అలా వారంతా సుమారుగా 165 కిలోమీటర్లు ప్రయాణించారు. మరో రెండు మూడు గంటలు ప్రయాణిస్తే వారి స్వస్థలాలలకు చేరుకోవల్సి ఉండగా నాందేడ్ సమీపంలో పోలీసులు ఆ ట్యాంకర్‌ను తనిఖీ చేయడతో వారంతా దొరికిపోయారు. దీంతో ఆ విద్యార్థులను పోలీసులు క్వారంటైన్‌కు తరలించారు.

Tags:    

Similar News