Telangana: నేటి నుంచే రూ.లక్ష సాయం.. మొదటి విడుతగా..

Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన బీసీలకు లక్ష సాయం డబ్బులను నేటి నుంచి లబ్దిదారులకు అందజేయనున్నారు.

Update: 2023-07-15 07:19 GMT

Telangana: నేటి నుంచే రూ.లక్ష సాయం.. మొదటి విడుతగా..

Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన బీసీలకు లక్ష సాయం డబ్బులను నేటి నుంచి లబ్దిదారులకు అందజేయనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 300 మందికి లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందించనున్నారు. ఇప్పటికే అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. గత నెల నుంచే అర్హులకు లక్ష ఆర్థిక సాయాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. గత నెలలో వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌, పరిగి నియోజకవర్గాల్లో 20 మంది బీసీ కులవృత్తుల వారికి లక్ష చొప్పున అందించారు. అయితే అర్హులకు జూన్‌ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అనంతరం దరఖాస్తుల వారీగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులను ఎంపిక చేశారు. బీసీ కుల, చేతివృత్తులకు చెందిన వారు వృత్తి పనిముట్లు, ముడిసరుకు కొనేందుకు ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అం దిస్తున్నది. ఈ సాయాన్ని కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తున్నారు.

నేటి నుంచి అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఆర్థిక సాయం అందనుంది. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ల్లో 3వందల మంది చొప్పున నాలుగు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 12వందల మందికి లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని ఈ నెలాఖరు వరకు ఎమ్మెల్యేలు అందించనున్నారు. అయితే గత 20 వరకు 13వేల 157 మంది బీసీ కులవృత్తు లు, ఎంబీసీ కులాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో, మున్సిపాలిటీల్లో కమిషనర్ల ఆధ్వర్యంలో పరిశీలించి 3వేల 141 మందిని అనర్హులుగా గుర్తించి, మరో 9వేల 607 మం దిని అర్హులుగా ఎంపిక చేశారు. అయితే మరో 409 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. అర్హుల జాబితాను అధికారులు ప్రభుత్వానికి అందజేయగా మొదటి విడుతగా 3వేల 387 యూనిట్లకు ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News