రైళ్ళలో బాణాసంచా తీసుకెళ్లడం ప్రమాదకరం

ప్రయాణికుల రక్షణను దృష్టిలో పెట్టుకుని రైళ్లలో పేలుడు పదార్థాలు తీసుకెలొద్దని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేష్‌ తెలిపారు.

Update: 2019-10-27 05:48 GMT

ప్రయాణికుల భద్రతను, రక్షణను దృష్టిలో పెట్టుకుని రైళ్లలో ఎలాంటి పేలుడు పదార్థాలు తీసుకెలొద్దని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి పండగ సందర్భంగా బాణాసంచాను రైళ్లల్లో తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమని ఆయన పేర్కొన్నారు.

బాణాసంచా తీసుకెల్తు ఎవరైనా దొరికితే ఆ ప్రయాణికులపైన రైల్వేయాక్ట్‌ –1989లోని సెక్షన్‌లు 164, 165 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. రైళ్ళలో ప్రయాణించే వారిలో ఎవరిదగ్గరైనా బాణాసంచా కనిపించినా, వారి దగ్గర బాణాసంచా ఉన్నట్టు అనుమానం వచ్చినా వెంటనే 182 నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరు రైళ్ళలో ప్రయాణించేటప్పుడు జాగ్రత వహించాలని, ప్రయాణికుల భద్రతే తమకు ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు.


Tags:    

Similar News