Radiation: మొబైల్‌ టవర్స్‌ రేడియేషన్‌ వల్ల క్యాన్సర్‌, ప్రెగ్నెన్సీ కోల్పోవడం జరుగుతుందా..!

Radiation: స్మార్ట్‌ఫోన్ జీవితంలో ఒక ముఖ్య భాగంగా మారింది. ఇది లేనిదే కాలు కూడా బయటపెట్టలేం. దీనివల్ల చాలా పనులు సులభంగా జరుగుతున్నాయి.

Update: 2023-10-28 13:30 GMT

Radiation: మొబైల్‌ టవర్స్‌ రేడియేషన్‌ వల్ల క్యాన్సర్‌, ప్రెగ్నెన్సీ కోల్పోవడం జరుగుతుందా..!

Radiation: స్మార్ట్‌ఫోన్ జీవితంలో ఒక ముఖ్య భాగంగా మారింది. ఇది లేనిదే కాలు కూడా బయటపెట్టలేం. దీనివల్ల చాలా పనులు సులభంగా జరుగుతున్నాయి. కానీ అంతే మొత్తంలో నష్టాలు కూడా ఉన్నాయి. అయితే ఏ పరికరమైనా మనం ఉపయోగించే దానిని బట్టి ఉంటుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు పెరిగిపోవడంతో సిగ్నల్స్‌ సమస్య మొదలైంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీని నుంచి బయటపడటానికి 'USOF ప్రాజెక్ట్‌ల కింద మొబైల్ టవర్లు, 4G కవరేజీ' అందిస్తున్నారు.

24,149 మొబైల్ టవర్ల ఏర్పాటు

USOF ప్రాజెక్టు కింద 33,573 గ్రామాలను కవర్ చేసే నెట్‌వర్క్‌ను సిద్దం చేస్తున్నారు. 24,149 మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. జనాభా ఎక్కువగా ఉన్న చోట మొబైల్ టవర్లు ఉంటాయి. ఈ పరిస్థితిలో మొబైల్ టవర్ల విషయంలో గందరగోళం నెలకొంది. దీని రేడియేషన్ కారణంగా గుండె జబ్బులు, గర్భం కోల్పోవడం, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొంతమంది అభిప్రాయం. ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఈ రోజు తెలుసుకుందాం.

మొబైల్ టవర్ నుంచి క్యాన్సర్?

వాస్తవానికి టవర్ల రేడియన్‌ వల్ల వ్యాధులు వస్తున్నాయని చాలామంది భావిస్తున్నారు. మొబైల్ టవర్ల వల్ల క్యాన్సర్ రాదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. మొబైల్ టవర్ల నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా మొబైల్ టవర్‌లు క్యాన్సర్‌కు కారణమవుతున్నట్లు ఎటువంటి ఆధారాలు కనుగొనలేదు.

శరీరానికి ప్రమాదం?

మానవ శరీరంపై ఈ విద్యుదయస్కాంత క్షేత్రం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. దీనికి రుజువుగా WHO, SCENIHR అనే రెండు ప్రసిద్ధ సంస్థలు ఇప్పటి వరకు చేసిన పరిశోధనలను చూపించారు. మొబైల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ పిండంపై ప్రభావం చూపుతుందా అంటే దీన్ని రుజువు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అలా అని ఇది సురక్షితమా అంటే దానికి కూడా ఆధారాలు లేవు. WHO 30 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచురించబడిన సుమారు 25,000 అధ్యయనాలను ఉదహరించింది. తక్కువ స్థాయి విద్యుదయస్కాంత క్షేత్రాలకు గురికావడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని మాత్రమే చెబుతోంది.

Tags:    

Similar News