Vivo New Smartphone: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. అత్యంత సన్నగా, 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది..!

Vivo New Smartphone: వివో Y19 5జీ గత నెలలో భారతదేశంలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 5,500mAh బ్యాటరీతో ఆవిష్కరించింది. ఇప్పుడు, చైనీస్ టెక్ బ్రాండ్ దేశంలో Y-సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Update: 2025-06-07 09:32 GMT

Vivo New Smartphone: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. అత్యంత సన్నగా, 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది..!

Vivo New Smartphone: వివో Y19 5జీ గత నెలలో భారతదేశంలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 5,500mAh బ్యాటరీతో ఆవిష్కరించింది. ఇప్పుడు, చైనీస్ టెక్ బ్రాండ్ దేశంలో Y-సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ పేరు వెల్లడించనప్పటికీ, అందిన సమాచారం ప్రకారం, దీనికి కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. రాబోయే Vivo Y-సిరీస్ హ్యాండ్‌సెట్ మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుందని, దాని బిల్డ్ 7.49మి.మీ మందంగా ఉంటుందని చెబుతున్నారు.

భారతదేశంలో Y-సిరీస్ కింద వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 15,000 లోపు ఈ విభాగంలో 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగిన అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ ఇదే కావచ్చు. అందుతున్న సమాచారం ప్రకారం, రాబోయే Vivo Y-సిరీస్ ఫోన్ ఫెస్టివ్ గోల్డ్, ఫ్రీస్టైల్ వైట్, నెబ్యులా పర్పుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

ఫ్రీస్టైల్ వైట్ కలర్ వేరియంట్ వెనుక ప్యానెల్‌పై ఒక ప్రత్యేకమైన నమూనాను కలిగి ఉంటుంది. దీని మందం 7.49మి.మీ ఉంటుంది. ప్రస్తుతానికి, ఈ నివేదికలో రాబోయే Vivo Y-సిరీస్ ఫోన్ పేరు, లాంచ్ టైమ్‌లైన్ , ఇతర స్పెసిఫికేషన్‌లు లేవు. వివో ప్రస్తుతం Y78 5G, వివో Y200 ప్రో,వివో Y300 ప్లస్ వంటి కర్వ్డ్ స్క్రీన్‌లతో అనేక స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉంది.


Vivo Y19 5G Price And Features

మేలో ప్రారంభించిన Vivo Y19 5G, వివో Y-సిరీస్ కుటుంబానికి తాజా చేరిక. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై నడుస్తుంది. దాని 4జీబీ ర్యా మ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499. ఫోన్‌లో 6.74-అంగుళాల HD+ (720 x 1,600 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉంది, ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా యూనిట్ ఉంది, ఇందులో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 0.08-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. అలానే IP54-రేటెడ్ బిల్డ్, 15W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,500mAh బ్యాటరీ ఉంది.

Tags:    

Similar News