బంఫర్ ఆఫర్.. కొత్త ఎలక్ట్రిక్ కారు కొంటే రూ. 1 లక్ష నగదు.. కొత్త ఈవీ పాలసీ.. ఎక్కడంటే?

కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధానికి ఊపిరి పోసేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. పాత వాహనాలను వదిలి ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మళ్లే వారికి రూ. 1 లక్ష వరకు నగదు.

Update: 2026-03-19 14:11 GMT

బంఫర్ ఆఫర్.. కొత్త ఎలక్ట్రిక్ కారు కొంటే రూ. 1 లక్ష నగదు.. కొత్త ఈవీ పాలసీ.. ఎక్కడంటే?

Electric car subsidy India: కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధానికి ఊపిరి పోసేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. పాత వాహనాలను వదిలి ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మళ్లే వారికి రూ. 1 లక్ష వరకు నగదు ప్రోత్సాహకంతో పాటు, రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తి మినహాయింపునిస్తూ కొత్త 'ఈవీ పాలసీ 2026'ను తీసుకువస్తోంది.

Electric car subsidy India: పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది. BS-IV లేదా అంతకంటే పాత వాహనాలను కలిగి ఉన్నవారు వాటిని స్క్రాప్ (తుక్కు) చేసి, కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేస్తే ప్రభుత్వం భారీగా ఆర్థిక సహాయం అందించనుంది. ఈ పథకం ద్వారా లభించే నగదు ప్రోత్సాహకం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్' (DBT) పద్ధతిలో జమ చేయనుంది. ఇలాంటి బంఫర్ ఆఫర్ ఎక్కడని ఆశగా ఎదురుచూస్తున్నారా..? ఇలాంటి ఆఫర్ ప్రకటించింది ఎక్కడో కాదండోయ్.. దేశ రాజధాని ఢిల్లీలో అని మీకు తెలుసా? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎవరెవరికి ఎంత ప్రోత్సాహకం..?

ప్రభుత్వం వివిధ విభాగాల వాహనాల కోసం వేర్వేరు రాయితీలను నిర్ణయించింది: 

ఎలక్ట్రిక్ కార్లు: రూ. 15 లక్షల లోపు ధర గల ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసే వారికి రూ. 1 లక్ష వరకు నగదు రాయితీ లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ మొదట దరఖాస్తు చేసుకున్న 1 లక్ష మందికి మాత్రమే వర్తిస్తుంది.

టూ-వీలర్లు: పాత పెట్రోల్ స్కూటర్ లేదా బైక్‌ను స్క్రాప్ చేసి కొత్త ఈ-బైక్ కొంటే రూ. 10,000 ఇన్సెంటివ్ అందుతుంది.

త్రీ-వీలర్లు: ఎల్5ఎం కేటగిరీకి చెందిన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల కొనుగోలుపై రూ. 25,000 వరకు రాయితీ ప్రకటించింది.

స్క్రాపింగ్ సర్టిఫికేట్ తప్పనిసరి..

ఈ పథకం ప్రయోజనం పొందాలంటే వాహనదారులు తమ పాత వాహనాన్ని ప్రభుత్వం గుర్తించిన అధికారిక కేంద్రంలోనే స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. అక్కడ లభించే స్క్రాపింగ్ సర్టిఫికేట్ పొందిన ఆరు నెలలలోపు కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలి. పాత వాహనం ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉందో, వారికి మాత్రమే ఈ నగదు ప్రోత్సాహకం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల రద్దు..

నగదు రాయితీలతో పాటు వాహన కొనుగోలు ఖర్చును తగ్గించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31, 2030 వరకు ఢిల్లీలో రిజిస్టర్ అయ్యే అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి 100 శాతం మినహాయింపు ఇవ్వనుంది. ముఖ్యంగా రూ. 30 లక్షల వరకు ధర ఉన్న కార్లకు ఈ పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. దీనివల్ల సామాన్యులకు ఈవీలు మరింత చేరువ కానున్నాయి.

Tags:    

Similar News