చేతిలోనే మినీ గేమింగ్ వరల్డ్.. లెనోవో కొత్త ట్యాబ్లెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ పవర్!
టెక్నాలజీ ప్రపంచంలో గేమింగ్ లవర్స్ కోసం లెనోవో అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. చైనా మార్కెట్లో తాజాగా లెనోవో లెజియన్ Y700 జెన్ 5 గేమింగ్ టాబ్లెట్‌ను లాంచ్ చేసింది.
చేతిలోనే మినీ గేమింగ్ వరల్డ్.. లెనోవో కొత్త ట్యాబ్లెట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ పవర్!
Lenovo Legion Y700: టెక్నాలజీ ప్రపంచంలో గేమింగ్ లవర్స్ కోసం లెనోవో అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. చైనా మార్కెట్లో తాజాగా లెనోవో లెజియన్ Y700 జెన్ 5 గేమింగ్ టాబ్లెట్‌ను లాంచ్ చేసింది. కాంపాక్ట్ సైజులో ఉంటూనే హై-ఎండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఈ డివైజ్, ప్రస్తుత జనరేషన్ గేమర్స్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయబడింది. ముఖ్యంగా పీసీ లేదా కన్సోల్ లెవెల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారి కోసం ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న 8.8 అంగుళాల డిస్‌ప్లే హ్యాండ్లింగ్‌కు చాలా ఈజీగా ఉంటూనే, విజువల్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన క్వాలిటీని అందిస్తుంది.
ఈ టాబ్లెట్ ధర విషయానికి వస్తే, చైనాలో దీని బేస్ వేరియంట్ (12GB + 256GB) ధర సుమారు 54,100 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. అలాగే హై-ఎండ్ వేరియంట్ అయిన 24GB ర్యామ్, 1TB స్టోరేజ్ మోడల్ దాదాపు 81,100 రూపాయల వరకు ఉంది. ఇది కార్బన్ క్రిస్టల్ బ్లాక్, ఐస్ సోల్ వైట్ అనే రెండు అట్రాక్టివ్ కలర్స్‌లో లభిస్తోంది. స్టూడెంట్స్ కోసం ప్రత్యేక సబ్సిడీ ధరలు కూడా అందుబాటులో ఉండటం విశేషం. గ్లోబల్ మార్కెట్లోకి ఇది ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ లేనప్పటికీ, దీని స్పెసిఫికేషన్స్ చూస్తుంటే మాత్రం గేమింగ్ సెగ్మెంట్‌లో ఇది ఒక సంచలనమనిపిస్తోంది.
డిస్‌ప్లే క్వాలిటీ విషయానికి వస్తే, ఇందులో 165Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ప్యానల్‌ను వాడారు. ఇది గేమింగ్ సమయంలో ఎంతో స్మూత్ అనుభూతిని ఇస్తుంది. 3040 x 1904 రిజల్యూషన్, 800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వచ్చే ఈ స్క్రీన్, ఎండలో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో 12-బిట్ కలర్ డెప్త్ ఉండటం వల్ల కలర్స్ చాలా రిచ్‌గా, రియలిస్టిక్‌గా ఉంటాయి. కళ్లకు అలసట కలగకుండా ఉండేందుకు ట్యూవ్ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. టచ్ శాంప్లింగ్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల మనం ఇచ్చే కమాండ్స్‌కు స్క్రీన్ ఇన్‌స్టంట్‌గా రెస్పాండ్ అవుతుంది, ఇది షూటింగ్ గేమ్స్ ఆడేవారికి పెద్ద ప్లస్ పాయింట్.
దీని పర్ఫార్మెన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి తోడు 24GB వరకు భారీ ర్యామ్ ఉండటం వల్ల మల్టీ టాస్కింగ్ లేదా హెవీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడేటప్పుడు ఎలాంటి లాగ్స్ ఉండవు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తున్న ఈ టాబ్లెట్, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ కావాలనుకునే వారి కోసం 2TB వరకు మెమరీ కార్డ్ వేసుకునే సదుపాయం కూడా ఉంది. గేమింగ్ తో పాటు ప్రొడక్టివిటీ కోసం కూడా ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.
ఈ టాబ్లెట్‌లో ఏఐ ఫీచర్లు మరో ప్రధాన ఆకర్షణ. వాయిస్ ప్రింట్ హంటర్, పిక్సెల్ స్నిపర్ వంటి ఫీచర్లు గేమ్ ఆడేటప్పుడు యూజర్లకు అదనపు అడ్వాంటేజ్‌ను ఇస్తాయి. వీటితో పాటు ఏఐ నోట్ టేకింగ్, సమ్మరైజేషన్ వంటి ఉత్పాదకత పెంచే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎంత సేపు గేమ్స్ ఆడినా డివైజ్ వేడెక్కకుండా ఉండటం కోసం 17,353 చదరపు మిల్లీమీటర్ల భారీ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. సెంట్రల్ కూలింగ్ ఆర్కిటెక్చర్ వల్ల వేడి మొత్తం సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి పర్ఫార్మెన్స్ తగ్గకుండా చూస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే డ్యూయల్ స్పీకర్లు గేమింగ్ అట్మాస్పియర్‌ను మరింత పెంచుతాయి.
బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 9000mAh భారీ బ్యాటరీ ఉంది, ఇది 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 10 గంటల పాటు నిరంతరంగా గేమ్స్ ఆడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ వల్ల ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడేటప్పుడు బ్యాటరీ పాడవకుండా డైరెక్ట్ పవర్ సప్లై జరుగుతుంది. కనెక్టివిటీ కోసం డ్యూయల్ USB టైప్-సి పోర్టులు ఇచ్చారు, దీనివల్ల ఛార్జింగ్ పెట్టి కూడా ఇయర్‌ఫోన్స్ లేదా ఇతర యాక్సెసరీస్ వాడుకోవచ్చు. మొత్తం మీద పవర్ ఫుల్ స్పెసిఫికేషన్స్ తో వచ్చిన ఈ లెజియన్ టాబ్లెట్ గేమర్స్ డ్రీమ్ గ్యాడ్జెట్ అని చెప్పవచ్చు.