Tech Tips: 5G నెట్‌వర్క్ మీ ఫోన్ బ్యాటరీని ఖాళీ చేస్తోందా.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చితే చాలు..!
Tech Tips: మీ ఫోన్‌ని నిరంతరం ఛార్జ్ చేస్తున్నారా? మీ ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? అయితే, ఈ రోజు మీకోసం ఓ అద్భుతమైన టిప్స్ తీసుకొచ్చాం. వీటితో మీ ఫోన్ బ్యాటరీని చాలా సమయం పాటు వాడుకునేలా చేసుకోవచ్చు. బ్యాటరీ త్వరగా అయిపోవడం 5G నెట్‌వర్క్‌కు కారణం కావచ్చు.
Tech Tips: 5G నెట్‌వర్క్ మీ ఫోన్ బ్యాటరీని ఖాళీ చేస్తోందా.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చితే చాలు..!
Tech Tips: మీ ఫోన్‌ని నిరంతరం ఛార్జ్ చేస్తున్నారా? మీ ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? అయితే, ఈ రోజు మీకోసం ఓ అద్భుతమైన టిప్స్ తీసుకొచ్చాం. వీటితో మీ ఫోన్ బ్యాటరీని చాలా సమయం పాటు వాడుకునేలా చేసుకోవచ్చు. బ్యాటరీ త్వరగా అయిపోవడం 5G నెట్‌వర్క్‌కు కారణం కావచ్చు. కొంతమంది వినియోగదారులు 5G కారణంగా, వారి ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందని భావిస్తున్నారు. 5G అనేది ఎక్కువ శక్తిని వినియోగించే కొత్త టెక్నాలజీ అన్నది నిజం. దీన్ని దృష్టిలో ఉంచుకుని, కొంతమంది 4G నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నారు. మీరు 5Gకి మారిన తర్వాత ఇప్పుడు 4Gని ఉపయోగించాలనుకుంటే, మీరు చింతించాల్సిన అవసరం లేదు. Android, iPhone రెండింటిలోనూ 5G నుంచి 4G నెట్‌వర్క్‌కి మారేందుకు సులభమైన మార్గాన్ని చెప్పబోతున్నాం.
ఆండ్రాయిడ్‌లో 5G నుంచి 4G నెట్‌వర్క్‌కి ఇలా మారండి:
1. ముందుగా, మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లాలి.
2. సెట్టింగ్‌లలోకి వెళ్తే, 'నెట్‌వర్క్ & ఇంటర్నెట్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
3. ఆ తర్వాత, మీరు 'మొబైల్ నెట్‌వర్క్'కి వెళ్లాలి.
4. ఇక్కడ మీరు 'ఫస్ట్ నెట్‌వర్క్'ని ఎంచుకుని, ఆపై '4G'ని ఎంచుకోవాలి.
iPhoneలో 5G నుంచి 4Gకి మారడం ఎలా:
1. ముందుగా, మీ ఐఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లాలి.
2. ఇప్పుడు 'సెల్యులార్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
3. ఇక్కడ 'సెల్యులార్ డేటా ఆప్షన్' ని ఎంచుకోవాలి.
4. ఇప్పుడు మీకు 'వాయిస్ & డేటా' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
5. ఇక్కడ మీరు 5G, 4G లేదా LTEని ఎంచుకోవచ్చు. మీరు 4Gకి తిరిగి మారాలనుకుంటే, 4Gని ఎంచుకోవాల్సి ఉంటుంది.
దీంతో మీ బ్యాటరీ త్వరగా డ్రైన్ అయ్యే సమస్య నుంచి బయటపడొచ్చు.