AI ఎఫెక్ట్.. ఆ ఉద్యోగాలు కూడా గోవిందా ..!

టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ.. మన వేళ్లు కీబోర్డ్ మీద నాట్యం చేసే రోజులు త్వరలోనే కనుమరుగవుతాయా?

Update: 2026-02-02 05:51 GMT

AI ఎఫెక్ట్.. ఆ ఉద్యోగాలు కూడా గోవిందా ..!

టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ.. మన వేళ్లు కీబోర్డ్ మీద నాట్యం చేసే రోజులు త్వరలోనే కనుమరుగవుతాయా? అవుననే అంటున్నారు SAP CEO క్రిస్టియన్ క్లేన్. 312 ఏళ్ల కీబోర్డ్ సామ్రాజ్యానికి AI ఎండ్ కార్డ్ వేయబోతోందనే వార్త ఇప్పుడు టెక్ సర్కిల్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

నిన్నటి వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే కీబోర్డ్ మీద టకటకలాడే శబ్దాలే గుర్తుకొచ్చేవి. కానీ, రాబోయే మూడేళ్లలో ఈ దృశ్యం పూర్తిగా మారిపోనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పుణ్యమా అని వాయిస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అద్భుతమైన స్థాయికి చేరుకుంది. ఇకపై డేటా ఎంట్రీ కోసం గంటల తరబడి టైప్ చేయాల్సిన అవసరం లేదు; సిస్టమ్‌తో మనం మాట్లాడితే చాలు, అది మన భావాలను డేటాగా, కోడింగ్‌గా మార్చేస్తుంది.

1714లో హెన్రీ మిల్ టైప్ రైటర్ కాన్సెప్ట్‌తో మొదలైన ఈ కీబోర్డ్ ప్రయాణం మానవ చరిత్రలో ఒక విప్లవం. మనిషికి, యంత్రానికి మధ్య అనుసంధానకర్తగా ఉన్న ఈ కీబోర్డ్ స్థానాన్ని ఇప్పుడు AI భర్తీ చేయబోతోంది. "మన గొంతే ఇకపై మన కీబోర్డ్" కాబోతోందని క్లేన్ పేర్కొనడం చూస్తుంటే, టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ మార్పు కేవలం సౌకర్యం మాత్రమే కాదు, ఒక హెచ్చరిక కూడా. ముఖ్యంగా డేటా ఎంట్రీ వంటి మాన్యువల్ పనులపై ఆధారపడే వారికి రాబోయే రోజుల్లో గడ్డు కాలమే. AI పాత తరం ఉద్యోగాలను వేగంగా రీప్లేస్ చేస్తోంది. కాబట్టి, టెకీలు కేవలం టైపింగ్ నైపుణ్యాలతో సరిపెట్టుకోకుండా, మారుతున్న AI సాంకేతికతకు అనుగుణంగా తమను తాము అప్‌గ్రేడ్ చేసుకోవడం అత్యవసరం. లేదంటే, ఈ టెక్ రేసులో వెనుకబడిపోవడం ఖాయం.

Tags:    

Similar News