RedMagic 11 Air: రెడ్‌మాజిక్ ఎయిర్.. స్లిమ్ గేమింగ్ మోడల్.. ఫీచర్లు చూశారా..?

RedMagic 11 Air: రెడ్‌మాజిక్ కంపెనీ తన కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మాజిక్ 11 ఎయిర్ మొదటి టీజర్ షేర్ చేసింది.

Update: 2026-01-10 16:18 GMT

RedMagic 11 Air: రెడ్‌మాజిక్ కంపెనీ తన కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మాజిక్ 11 ఎయిర్ మొదటి టీజర్ షేర్ చేసింది. ఈ బ్రాండ్‌లో స్లిమ్ గేమింగ్ మోడల్ ఫోన్ ఇది. ముందు రెడ్‌మాజిక్ 10 ఎయిర్ సిరీస్ లాంచ్ అయింది. కొత్త రెడ్‌మాజిక్ 11 ఎయిర్‌లో మేజర్ హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. అధికారిక స్పెసిఫికేషన్స్ ఇంకా వెల్లడి కాలేదు కానీ లీక్స్ చాలా ముఖ్యమైన వివరాలు చెప్పాయి. ఈ లీక్స్ ప్రకారం.. ఫ్లాగ్‌షిప్ పెర్ఫామెన్స్, ప్రీమియం గేమింగ్ ఫీచర్లు ఉంటాయి.

రెడ్‌మ్యాజిక్ అధికారికంగా రెడ్‌మ్యాజిక్ 11 ఎయిర్ మొదటి టీజర్ తాజాగా విడుదల చేసింది. టీజర్ లో స్లిమ్, మోడరన్ గేమింగ్ ఫోకస్ డిజైన్‌ను హైలైట్‌గా నిలిచింది. పూర్తి స్పెసిఫికేషన్స్ షేర్ చేయలేదు కానీ ఫోన్ వస్తుందని, త్వరలో లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ చేసింది. ఎయిర్ బ్రాండింగ్ వల్ల లైట్‌వెయిట్, సన్నని బాడీ ఉంటుందని అర్థం. పోర్టబుల్ డివైస్‌లు ఇష్టపడే గేమర్లకు ఇది ఆకర్షణీయంగా ఉంటుంది.

ఆన్‌లైన్‌లో డిస్‌ప్లే వివరాలు లీక్ అయ్యాయి లీక్స్ ప్రకారం.. రెడ్‌మ్యాజిక్ 11 ఎయిర్‌లో 6.85 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది. OLED ప్యానెల్ వైబ్రెంట్ కలర్లు, డీప్ కాంట్రాస్ట్ ఇస్తుంది. పెద్ద స్క్రీన్ గేమింగ్ మరియు మీడియా కన్సంప్షన్‌కు ఇమర్సివ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. రిఫ్రెష్ రేట్ వివరాలు తెలియవు కానీ గేమింగ్ ఫోన్‌లలో ఫాస్ట్ రేట్ ఆశిస్తున్నారు.

రెడ్‌మాజిక్ 11 ఎయిర్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉపయోగించవచ్చు. గీక్‌బెంచ్ లిస్టింగ్స్ దీన్ని కన్ఫర్మ్ చేశాయి. సింగిల్-కోర్ టెస్ట్‌లో 3,075 పాయింట్లు వచ్చాయి. మల్టీ-కోర్ పెర్ఫామెన్స్‌లో 9,934 పాయింట్లు సాధించింది. ఈ స్కోర్లు టాప్-టియర్ ఫ్లాగ్‌షిప్ పెర్ఫామెన్స్‌ను సూచిస్తున్నాయి. హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ సులభంగా హ్యాండిల్ చేస్తుంది. లీక్స్ ప్రకారం రెడ్‌మ్యాజిక్ 11 ఎయిర్ లో 24GB ర్యామ్ వరకు ఉంటుంది. ఇంత హై ర్యామ్ డిమాండింగ్ గేమ్స్, బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది. హార్డ్‌కోర్ మొబైల్ గేమర్లను టార్గెట్ చేస్తుంది. ఎక్స్‌టెండెడ్ గేమింగ్ సెషన్లు సులభంగా మేనేజ్ అవుతాయి. లాంగ్-టర్మ్ పెర్ఫార్మెన్స్ స్టెబిలిటీ మెరుగుపడుతుంది.

రెడ్‌మాజిక్ 11 ఎయిర్ 7,000mAh భారీ బ్యాటరీతో వస్తుంది. ఇది లాంగ్ గేమింగ్ సెషన్లకు సరిపోతుంది. 120W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ మధ్యలో క్విక్ పవర్ టాప్-అప్‌లు సాధ్యమవుతాయి. కాంపిటిటివ్, స్ట్రీమింగ్ గేమర్లకు ఇది చాలా ఉపయోగకరం. లీక్స్ ప్రకారం ఫోన్ మందం 7.85mm మాత్రమే ఉంటుంది. బరువు సుమారు 207 గ్రాములు. గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌కు ఇది చాలా సన్నకడం. పెద్ద బ్యాటరీతో సన్నని డిజైన్ బ్యాలెన్స్ చేయడం అద్భుతం. ఎక్స్‌టెండెడ్ యూజ్‌లో కంఫర్ట్ పెరుగుతుంది.

రెడ్‌మాజిక్ 11 ఎయిర్‌లో యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇంటెన్స్ గేమింగ్ సమయంలో హీట్ తగ్గిస్తుంది. హెవీ లోడ్ కింద స్టెబుల్ పెర్ఫామెన్స్ నిర్వహిస్తుంది. గేమింగ్ ఫోన్‌లకు ఎఫెక్టివ్ థర్మల్ మేనేజ్‌మెంట్ అవసరం. యాక్టివ్ కూలింగ్ వల్ల ఫ్రేమ్ రేట్స్ కన్సిస్టెంట్‌గా ఉంటాయి. రెడ్‌మాజిక్ లీక్ స్పెసిఫికేషన్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. టీజర్ రావడంతో ఇక లాంచ్ కూడా త్వరలో ఉంటుందని సమాచారం. ప్రీమియం గేమింగ్ సెగ్మెంట్‌లో పోటీపడడానికి రెడ్‌మాజిక్ 11 ఎయిర్ సిద్ధంగా ఉంది.

Tags:    

Similar News