OnePlus Red Rush Days Sale: వన్‌ప్లస్ రెడ్ రష్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై కుప్పలు కుప్పలుగా డిస్కౌంట్లు..!
OnePlus Red Rush Days Sale: వన్‌ప్లస్ మరోసారి రెడ్ రష్ సేల్‌ను ప్రకటించింది. దీనిలో వన్‌ప్లస్ 13 సిరీస్, నార్డ్ CE 4తో సహా తాజా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు,నో-కాస్ట్ EMI ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
OnePlus Red Rush Days Sale: వన్‌ప్లస్ రెడ్ రష్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై కుప్పలు కుప్పలుగా డిస్కౌంట్లు..!
OnePlus Red Rush Days Sale: వన్‌ప్లస్ మరోసారి రెడ్ రష్ సేల్‌ను ప్రకటించింది. దీనిలో వన్‌ప్లస్ 13 సిరీస్, నార్డ్ CE 4తో సహా తాజా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు,నో-కాస్ట్ EMI ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ మార్చి 4 నుండి మార్చి 9, 2025 వరకు లైవ్ అవుతుంది. వినియోగదారులు OnePlus.in, Amazon, Reliance Digital ,Cromaతో సహా అన్ని ప్రధాన ప్లాట్‌ఫామ్‌లలో ఈ డీల్స్‌ను ఆస్వాదించచ్చు. రండి.. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
OnePlus 13, 13R Discount Offer
వన్‌ప్లస్ 13ని కొనుగోలు చేసే వారికి మొబైల్‌పై రూ. 5,000 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలానే పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.7,000 వరకు బోనస్ కూడా ఇస్తున్నారు. మీరు వన్‌ప్లస్ 13ఆర్‌ని కొనాలని చూస్తున్నట్లయితే మీరు ఎంచుకున్న క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తే రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు రూ. 2,000 క్యాష్ డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది. తద్వారా రెండు ఫోన్లను అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.
OnePlus 12, 12R Discount Offer
వన్‌ప్లస్ 12 మొబైల్‌పై రూ. 8,000 ధర తగ్గింపుతో పాటు రూ. 4,000 బ్యాంక్ తగ్గింపు లభిస్తుంది. అలానే వన్‌ప్లస్ 12ఆర్‌ను రూ. 10,000 డిస్కౌంట్, రూ. 3,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనచ్చు. దీని కారణంగా మీరు ఈ రెండు ఫోన్‌లను చాలా తక్కువ ధరకు ఆర్డర్ చేయచ్చు.
OnePlus Nord Series Discount
కంపెనీ వన్‌ప్లస్ నార్డ్ 4పై రూ. 4,000 బ్యాంక్ తగ్గింపుతో పాటు సేల్ సమయంలో రూ. 1,000 ధర తగ్గింపు ఇస్తుంది. దీనితో పాటు మీరు సేల్‌లో వన్‌ప్లస్ నార్డ్ CE4పై రూ. 2,000, CE4 లైట్‌పై రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది.
No-cost EMI option
మీకు కంపెనీ వెబ్‌సైట్, స్టోర్ యాప్, అమెజాన్ మరియు క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్‌తో సహా ఆఫ్‌లైన్ రిటైలర్‌ల నుండి వన్‌ప్ల్ రెడ్ రష్ డేస్ సేల్ ఆఫర్స్ లభిస్తాయి. ఎంపిక చేసిన ఫోన్‌లలో వినియోగదారులు 24 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా దక్కించుకోవచ్చు.