Nothing Phone 3a Lite: నథింగ్ ఫోన్‌.. అమెజాన్‌లో బెస్ట్ డీల్.. చీప్‌గా కొనేయండి..!

నథింగ్ కంపెనీ 2025 నవంబర్‌లో లాంచ్ చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (3a) లైట్ ధరను భారతదేశంలో తగ్గించింది.

Update: 2026-01-06 12:00 GMT

Nothing Phone 3a Lite: నథింగ్ ఫోన్‌.. అమెజాన్‌లో బెస్ట్ డీల్.. చీప్‌గా కొనేయండి..!

Nothing Phone 3a Lite: నథింగ్ కంపెనీ 2025 నవంబర్‌లో లాంచ్ చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (3a) లైట్ ధరను భారతదేశంలో తగ్గించింది. రెండు నెలల క్రితమే లాంచ్ అయిన ఈ ఫోన్.. అప్పుడే కొత్త డిస్కౌంట్లతో మరింత ఆకర్షణీయంగా మారింది. ఆన్‌లైన్ డీల్స్, బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 2026 ప్రారంభం ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనడానికి మంచి సమయం.

డిజైన్, కెమెరా క్వాలిటీ, క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ ఫోకస్ గా ఈ ఫోన్ తయారుచేయడబడింది. 3a లైట్ మిడ్-రేంజ్ ధరలో ఆధునిక ఫీచర్లు అందిస్తుంది.

ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. అమెజాన్‌లో ఇది డిస్కౌంట్ ధర రూ.20,388కు లభిస్తుంది. ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే 7.5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (గరిష్ఠంగా రూ.1,000) లభిస్తుంది. దీంతో ఫైనల్ ధర రూ.19,388కు తగ్గిపోతుంది. పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.19,250 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఎక్స్‌ఛేంజ్ విలువ ఫోన్ మోడల్, స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్లతో లాంచ్ ధర కంటే చాలా తక్కువగా లభిస్తుంది.

ఈ ఫోన్‌లో 6.77 అంగుళాల పెద్ద AMOLED డిస్‌ప్లే ఉంది. ఫుల్ HD+ రిజల్యూషన్ (1080 x 2392 పిక్సెల్స్)తో వస్తుంది. 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ 3000 నిట్స్ వరకు ఉండటంతో ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నథింగ్ సిగ్నేచర్ డిజైన్ తో క్లీన్, మోడర్న్ లుక్ ఇస్తుంది. ఈ కొత్త ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్‌తో వస్తుంది. రోజువారీ పనులు, మోడరేట్ గేమింగ్ స్మూత్‌గా నడుస్తాయి. ఆండ్రాయిడ్ 15తో నథింగ్ ఓఎస్ 3.5 ఉంది. క్లీన్ ఇంటర్‌ఫేస్, తక్కువ బ్లోట్‌వేర్‌తో సులభమైన అనుభవం లభిస్తుంది.

5000mAh బ్యాటరీ ఉంది. సాధారణ వినియోగానికి రోజంతా రన్ అవుతుంది. 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో త్వరగా ఛార్జ్ అవుతుంది. ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా (f/1.88), 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా. సోషల్ మీడియా, సాధారణ ఫోటోగ్రఫీకి ఈ ఫోన్ మంచి ఆప్షన్. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. త్వరగా, సురక్షితంగా అన్‌లాక్ అవుతుంది. ఐపీ54 రేటింగ్‌తో డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్.ధర తగ్గింపు తర్వాత నథింగ్ ఫోన్ (3a) లైట్ మిడ్-రేంజ్‌లో బెస్ట్ వాల్యూ అందిస్తుంది. డిస్‌ప్లే, కెమెరా, క్లీన్ సాఫ్ట్‌వేర్‌తో ఈ ఫోన్ ప్రస్తుతం ఒక సాలిడ్ ఆప్షన్.

Tags:    

Similar News