Motorola Signature: మార్కెట్లోకి ‘మోటరోలా సిగ్నేచర్’ వచ్చేస్తోంది.. ఈ ఫోన్లతో గట్టి పోటీ..!
Motorola Signature: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోటరోలా సిగ్నేచర్‌ను జనవరి 23న భారతదేశంలో అధికారికంగా విడుదల చేయనుంది.
Motorola Signature: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోటరోలా సిగ్నేచర్‌ను జనవరి 23న భారతదేశంలో అధికారికంగా విడుదల చేయనుంది. ఈ హ్యాండ్ సెట్ ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఇటీవల జరిగిన CES 2026 ఎలక్ట్రానిక్స్ ఈవెంట్‌లో కంపెనీ దీన్ని ప్రపంచానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..
మోటరోలా సిగ్నేచర్.. 6.8 అంగుళాల సూపర్ HD LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 1,264 x 2,780 పిక్సెల్స్ రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్, 450ppi పిక్సెల్ డెన్సిటీతో రానుంది. గరిష్టంగా 6,200 నిట్స్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, అలాగే సౌండ్ బై బోస్ ఆడియో సపోర్ట్ ఈ ఫోన్‌ను మరింత ప్రత్యేకంగా నిలెబెడతాయి.
ఇక మోటరోలా సిగ్నేచర్ కెమెరా విషయానికి వస్తే.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ప్రధానంగా 50MP Sony LYT-828 సెన్సార్ 3.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. డిజైన్ పరంగా.. ఫోన్‌లో అల్యూమినియం ఫ్రేమ్, 6.99 మిమీ మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది. పవర్ కోసం 5,200mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని అందించారు. ఇకపోతే Android 16 ఆధారిత Helo UI సాఫ్‌వేర్ మీద ఈ ఫోన్ నడుస్తుంది.
ఈ మోటరోలా సిగ్నేచర్ 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.84,999గా తాజా లీకుల ద్వారా తెలుస్తోంది. అలాగే 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ.82,000గా ఉండవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ధరల గురించి మోటరోలా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే లాంచ్ రోజున ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
మోటరోలా సిగ్నేచర్ హ్యాండ్ సెట్ పాంటోన్ మార్టిని, ఆలివ్, కార్బన్ వంటి ప్రీమియం కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుందని సమాచారం. ప్రీమియం డిజైన్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు కలిగిన ఈ ఫోన్ హైఎండ్ సెగ్మెంట్‌లో ఐఫోన్లకు సైతం గట్టి పోటీగా నిలుస్తుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.