Motorola Edge Fusion: మోటోరోలా నుంచి అదిరిపోయే బడ్జెట్ కిల్లర్.. మోటరోలా 60 ఫ్యూజన్ లాంచ్..!

Motorola Edge Fusion: మోటోరోలా బ్రాండ్ నుంచి మోస్ట్ వెయిటెడ్ స్మార్ట్‌ఫోన్ 'మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్' సరికొత్త బడ్జెట్ వేరియంట్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Update: 2026-02-08 07:30 GMT

Motorola Edge Fusion: మోటోరోలా నుంచి అదిరిపోయే బడ్జెట్ కిల్లర్.. మోటరోలా 60 ఫ్యూజన్ లాంచ్..!

Motorola Edge Fusion: మోటోరోలా బ్రాండ్ నుంచి మోస్ట్ వెయిటెడ్ స్మార్ట్‌ఫోన్ 'మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్' సరికొత్త బడ్జెట్ వేరియంట్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం రూ. 19,999 (బ్యాంక్ ఆఫర్లతో కలిపి) ధరకే లభిస్తున్న ఈ ఫోన్, తన ప్రీమియం ఫీచర్లతో యూత్ మైండ్ బ్లాక్ చేస్తోంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే సేల్స్ మొదలుపెట్టింది. గతంలో లాంచ్ అయిన హై-ఎండ్ వేరియంట్ల కంటే ఇది పాకెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా, పాంటోన్ అమెజానైట్ వంటి ఫోర్ అట్రాక్టివ్ కలర్ ఆప్షన్లలో లభిస్తూ ట్రెండ్ సెట్ చేస్తోంది.

ఈ ఫోన్ మెయిన్ హైలైట్ దీని 6.7 ఇంచ్ ఆల్-కర్వ్డ్ pOLED డిస్‌ప్లే అని చెప్పాలి. 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వచ్చే ఈ స్క్రీన్, మండుటెండలో కూడా మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ముఖ్యంగా గేమర్స్ కోసం 300Hz టచ్ సాంప్లింగ్ రేట్ ఉండటం వల్ల టచ్ రెస్పాన్స్ మెరుపు వేగంతో ఉంటుంది. వాటర్ టచ్ 3.0 టెక్నాలజీ వల్ల మీ చేతులు తడిగా ఉన్నా ఫోన్ స్మూత్‌గా పనిచేస్తుంది. దీనికి తోడు గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉండటం వల్ల ఫోన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ఇందులో ఇంజిన్‌లా పనిచేస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత మోటోరోలా హలో UI తో ఈ ఫోన్ చాలా క్లీన్ యూజర్ ఎక్స్పీరియన్స్‌ని అందిస్తుంది. భవిష్యత్తు కోసం మూడు ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ప్రామిస్ చేయడంతో యూజర్లు నిశ్చింతగా ఉండొచ్చు. భారీ యాప్స్ వాడినా లేదా మల్టీ టాస్కింగ్ చేసినా లాగ్ లేకుండా పనిచేయడం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత.

కెమెరా లవర్స్ కోసం ఇందులో 50MP సోనీ LYT700C ప్రైమరీ కెమెరాను అమర్చారు. OIS సపోర్ట్ ఉండటం వల్ల కదులుతున్నప్పుడు కూడా ఫొటోలు, వీడియోలు షేక్ కాకుండా క్లారిటీగా వస్తాయి. సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉండటమే కాకుండా, మోటో AI ఫీచర్లు ఫోటోలను ఆటోమేటిక్‌గా ఎన్‌హాన్స్ చేస్తాయి. గూగుల్ 'సర్కిల్ టు సెర్చ్' , మ్యాజిక్ ఎరేజర్ వంటి ఫీచర్లు మీ ప్రొడక్టివిటీని మరో లెవల్‌కు తీసుకెళ్తాయి. 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ సోషల్ మీడియా క్రియేటర్లకు బాగా ప్లస్ అవుతుంది.

చివరగా ఈ ఫోన్ బ్యాటరీ, బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పుకోవాలి. 5500mAh బ్యాటరీని కేవలం 68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో నిమిషాల్లో ఫుల్ చేయవచ్చు. ఇది IP68 , IP69 రేటింగ్స్‌తో వస్తుంది, అంటే నీటిలో పడినా లేదా ధూళి తగిలినా ఫోన్‌కు ఏమీ కాదు. మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ ఉండటం వల్ల ఫోన్ చాలా ధృడంగా ఉంటుంది. ఇన్ని ఫీచర్లు ఉన్నా ఇది కేవలం 180 గ్రాముల బరువు, 8.2mm మందంతో చాలా స్లిమ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది.

Tags:    

Similar News