Motorola Edge 60 Fusion 5G: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. Motorola Edge 60 Fusion రూ.3,999కే!
Motorola Edge 60 Fusion 5G: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్స్‌లో Motorola Edge 60 Fusion 5Gపై భారీ డిస్కౌంట్. ఎక్స్చేంజ్ బోనస్‌తో రూ.3,999కే కొనుగోలు చేసే అవకాశం.
Motorola Edge 60 Fusion 5G: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. Motorola Edge 60 Fusion రూ.3,999కే!
Motorola Edge 60 Fusion 5G: మిడ్‌రేంజ్ విభాగంలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సేల్స్‌లో భాగంగా Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్ బోనస్ అందిస్తోంది. ఈ ఆఫర్లను వినియోగించుకుంటే ఈ ఫోన్‌ను కేవలం రూ.3,999కే పొందే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది.
Motorola Edge 60 Fusion 5Gలో 6.67 అంగుళాల pOLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i అందించారు. ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 (4nm) ప్రాసెసర్ ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 (Hello UI) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. మూడు సంవత్సరాల OS అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనుంది. కెమెరా విభాగంలో 50MP సోనీ LYT-700C ప్రైమరీ సెన్సార్‌తో పాటు 13MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరా (4K వీడియో సపోర్ట్) అందుబాటులో ఉంది.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5500mAh శక్తివంతమైన బ్యాటరీతో పాటు 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్‌ను కలిపితే గరిష్టంగా రూ.20 వేల వరకు లాభం పొందవచ్చని తెలిపింది.