Jio OTT: రూ.79కే జియో హాట్‌స్టార్.. ఇలాంటి ఆఫర్ ఎప్పుడూ రాదు తెలుసా..?
Jio OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ఇప్పుడు చాలా తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. తాజాగా జియోహాట్‌స్టార్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రకటించింది.
Jio OTT: రూ.79కే జియో హాట్‌స్టార్.. ఇలాంటి ఆఫర్ ఎప్పుడూ రాదు తెలుసా..?
Jio OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ఇప్పుడు చాలా తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. తాజాగా జియోహాట్‌స్టార్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రకటించింది. ఈ ప్లాన్‌లు కొత్త యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. జనవరి 28 నుంచి ఈ కొత్త ప్లాన్‌లు అమలులోకి వస్తాయి. పాత సబ్‌స్క్రైబర్ల ప్లాన్‌లలో ఎలాంటి మార్పులు ఉండవు. వారు ఇప్పటివరకు ఉన్న ప్లాన్‌లనే కొనసాగుతారు.
కంపెనీ వివిధ రకాల పరికరాల ఆధారంగా ప్లాన్‌లను మార్చింది. మొబైల్ యూజర్లు, ఫ్యామిలీ టీవీ ప్రేక్షకులకు సరిపడేలా ఫ్లెక్సిబుల్ ఆప్షన్లు ఇచ్చారు. గత 11 నెలల్లో కనెక్టెడ్ టీవీల్లో వీక్షణ బాగా పెరిగింది. దీంతో పరికరాల ఆధారంగా ప్లాన్‌లు తీసుకొచ్చారు. ఇప్పుడు మొబైల్, సూపర్, ప్రీమియం అనే మూడు రకాల ప్లాన్‌లలోనూ జియోహాట్‌స్టార్ మంత్లీ ఆప్షన్ తీసుకొచ్చింది. ఇది తక్కువ కాలం, తక్కువ ఖర్చుతో చూడాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది.
మొబైల్ ప్లాన్ నెలకు రూ.79కి మొదలవుతుంది. ఒకే మొబైల్ డివైస్‌లో మాత్రమే స్ట్రీమింగ్ చేయవచ్చు. క్వార్టర్లీ ప్లాన్ రూ.149, ఏడాది ప్లాన్ రూ.499. ఈ ప్లాన్ పూర్తిగా యాడ్‌లతో ఉంటుంది. హాలీవుడ్ కంటెంట్ ఈ బేస్ మొబైల్ ప్లాన్‌లో ఉండదు. స్మార్ట్‌ఫోన్‌లో ఒంటరిగా చూసే వారికి ఇది బాగా సరిపోతుంది. సూపర్ ప్లాన్ నెలకు రూ.149. క్వార్టర్లీ రూ.349, ఏడాది రూ.1,099. ఒకేసారి రెండు డివైస్‌లలో స్ట్రీమింగ్ చేయవచ్చు. మొబైల్, వెబ్ బ్రౌజర్, కనెక్టెడ్ టీవీల్లో చూడవచ్చు.
హాలీవుడ్ కంటెంట్ ఎక్స్‌ట్రా ఛార్జ్ లేకుండా ఉంటుంది. చిన్న ఫ్యామిలీలు, బహుళ స్క్రీన్‌లలో చూసే వారికి ఇది అనువుగా ఉంటుంది. ప్రీమియం ప్లాన్ నెలకు రూ.299 నుంచి మొదలవుతుంది. క్వార్టర్లీ రూ.699, ఏడాది రూ.2,199. ఒకేసారి నాలుగు డివైస్‌లలో స్ట్రీమింగ్ చేయవచ్చు. చాలా కంటెంట్ యాడ్-ఫ్రీగా ఉంటుంది. లైవ్ స్పోర్ట్స్, కొన్ని లైవ్ షోల్లో మాత్రం యాడ్‌లు ఉండవచ్చు. ఫ్యామిలీలు, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్.
మొబైల్ ప్లాన్ యూజర్లు హాలీవుడ్ కంటెంట్‌ను అదనంగా కొనాలి. ఉదాహరణకు రూ.79 మొబైల్ ప్లాన్‌కు రూ.49 ఎక్స్‌ట్రా చెల్లించాలి. అయితే సూపర్, ప్రీమియం ప్లాన్‌లలో హాలీవుడ్ కంటెంట్ ఆటోమాటిక్‌గా ఉచితంగా ఉంటుంది. కొత్త ప్రైసింగ్ కేవలం కొత్త యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. పాత సబ్‌స్క్రైబర్ల ప్లాన్‌లలో ఎలాంటి మార్పులు లేవు. వారి ప్రయోజనాలు అలాగే కొనసాగుతాయి. జియోహాట్‌స్టార్ చౌక ఎంట్రీ లెవల్ ప్లాన్‌లతో కొత్త యూజర్లను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.