Jio offers: జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్!
Jio offers: టెలికాం రంగంలో సంచలనాలకు మారుపేరైన రిలయన్స్ జియో, సామాన్యుల కోసం ఒక అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తక్కువ ధరకు 28 రోజుల చెల్లుబాటు అయ్యే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకు వచ్చింది.
Jio offers: జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్!
Jio offers: టెలికాం రంగంలో సంచలనాలకు మారుపేరైన రిలయన్స్ జియో, సామాన్యుల కోసం ఒక అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తక్కువ ధరకు 28 రోజుల చెల్లుబాటు అయ్యే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకు వచ్చింది. కేవలం 123 రూపాయలకే నెలంతా అపరిమిత ప్రయోజనాలను అందిస్తూ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలకు గట్టి పోటీనిస్తోంది. ఈ ప్లాన్ రూ.123 ప్లాన్‌తో వినియోగదారులకు ఏయే బెనిఫిట్స్ అందుతాయో, ఈ ప్లాన్‌తో రిఛార్జ్ చేసుకుంటే ఎంత GB వరకు డేటాను వస్తుంది, అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం చెల్లుబాటు (Validity) కోరుకునే వారి కోసం జియో తీసుకొచ్చిన రూ.123 ప్లాన్ ఒక వరమని చెప్పవచ్చు. ముఖ్యంగా డేటా కంటే కాలింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చే వారికి ఇది సరైన ఎంపికగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
రూ. 123 ప్లాన్ ప్రయోజనాలు ఇవే:
* ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
* రోజుకు 0.5GB హై-స్పీడ్ డేటా వస్తుంది. అంటే మొత్తం 28 రోజులకు గానూ 14GB డేటా లభిస్తుంది. ఒకవేళ డైలీ లిమిట్ అయిపోతే.. 64kbps వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు.
* దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. దీనితో పాటు 300 SMS లు ఉచితంగా వస్తాయి.
* ఈ రిఛార్జ్ ప్లాన్‌తో జియో టీవీ (JioTV), జియో సావన్ (JioSaavn) వంటి యాప్స్‌ను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.
గమనిక: ఈ ప్లాన్ విషయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని వినియోగదారులందరూ గమనించాలి. ఇది కేవలం 'జియోభారత్' (JioBharat) ఫోన్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. మీరు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తుంటే ఈ ప్లాన్ మీకు చెల్లుబాటు కాదు. అలాగే ఎయిర్‌టెల్ లేదా వొడాఫోన్ వంటి ఇతర నెట్‌వర్క్స్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో ఇంత చౌకైన ప్లాన్ మరెక్కడా లేదు. మీరు జియోభారత్ ఫోన్ వాడుతున్నట్లయితే, నెలకు కేవలం రూ.123తో అపరిమిత కాలింగ్, డేటా ప్రయోజనాలను పొందడానికి ఇది ఉత్తమమైన ఎంపికగా చెబుతున్నారు.